-

అన్ని రంగాల్లో అభివృద్ధి

27 Feb, 2017 15:06 IST|Sakshi
వలసల నివారణకు చర్యలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
వేముల శివాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

 
మిడ్జిల్‌: అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లా గత 50ఏళ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసిఆర్‌ హయాంలో సాధ్యమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వేములలోని శివాంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి వేయి రోజులు అవుతుందని తెలిపారు. గత 50ఏళ్లుగా వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాను, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. 

ఎత్తిపోతల పూర్తయితే..: పాలమూరు ఎత్తిపోథల పథకం పూర్తయితే మహబూబ్‌నగర్‌ జిల్లా సస్య శ్యామలం అవుతుందని మంత్రి అన్నారు. ఇక్కడి నుంచి వలసలు అగి ఇక్కడే ఇతర ప్రాంతాల వారికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. త్వరలో అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూంలు నిర్మించి ఇస్తామన్నారు. 

కేసీఆర్‌ చొరవతో..: కల్వకుర్తి ఎత్తిపోథల పథకం కేసీఆర్‌ చొరవతోనే పూర్తయిందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఖరీప్‌ వరకు మిడ్జిల్‌ మండల రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం తెలంగాణలో నూతనంగా మైనార్టీల విద్యార్థుల కోసం అదనంగా 118 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన, ఇప్పుటి అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యశోద, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిరినాయక్, వైస్‌ ఎంపీపీ సుదర్శన్, నాయకులు పాండు, గోపాల్‌రెడ్డి, చెన్నయ్య, శివప్రసాద్, శ్రీనివాసులు, జగన్, గోపాల్, కాడయ్య, శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, దామోదర్‌రెడ్డి, అంబాచారి, లింగంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
అట్టహాసంగా బండలాగుడు పోటీలు: మండలంలోని వేములలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించే రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలను ఆదివారం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పోటీలలో ఐదు జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొదటి బహుమతి రూ.25వేల నగదు తలకొండపల్లి మండలంలోని పడకల్‌కు చెందిన గోపాల్‌రెడ్డి, ద్వితీయ బహుమతి రూ.20వేలు ఇటిక్యాల మండలం దుందూర్‌కు చెందిన వరప్రసాద్, తృతీయ బహుమతి రూ.15వేలు కొల్లాపూర్‌ మం డలం చిన్నంబావికి చెందిన రాజు, నాలుగో బహుమతి రూ.10వేలు పెబ్బెరుకు చెందిన శ్రీనివాసులు ఎద్దులు గెలుపొందాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యశోద పాండు, చెన్నయ్య, గిరినాయక్, గోపాల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, ఆంజనేయులు, లింగం, కృష్ణయ్య, మైసయ్య, కృష్ణయ్య, అంబాచారి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి శ్రీను పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు