ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’

17 Mar, 2020 12:30 IST|Sakshi

విచారణను ఏప్రిల్‌ 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్‌ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు)

కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్‌ పేర్కొన్నారు. (రేవంత్‌ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా