తల్పేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

12 Aug, 2015 11:21 IST|Sakshi

చర్ల : ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తల్పేరు ప్రాజెక్టులోకి ఒగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లలో 7 గేట్లను బుధవారం ఉదయం రెండు అడుగుల మేర ఎత్తివేసి పదివేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సరిహద్దులోని ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతుండడంతో తల్పేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. తల్పేరు నీటి నిల్వ సామర్ధ్యం 74 మీటర్లు కాగా 73.90 మీటర్ల వద్ద నీటిని నిల్వఉంచి మిగిలిన నీటిని దిగువకు వదులు తున్నారు. ఎగువనుంచి వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో ప్రాజెక్టు జేఈ వెంకటేశ్వరరావు , సిబ్బంది ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సామర్ధ్యానికి మించి నీళ్లు ఉండకుండా గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు.
 

మరిన్ని వార్తలు