శ్రీరాంసాగర్ లోకి భారీగా ఇన్‌ఫ్లో

11 Sep, 2017 11:53 IST|Sakshi
నిజామాబాద్‌ : ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు ఎస్సారెస్పీ డీఈఈ జగదీశ్ తెలిపారు. ఈ జలాలు ఎస్సారెస్పీకి సోమవారం మధ్యాహ్నానికి  చేరుకుంటాయన్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా,  ఆదివారం సాయంత్రానికి 1074.00 అడుగుల (37.379 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. 
 
కడెం ప్రాజెక్టుకూ వరద 
కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.575 అడుగులు (7.233 టీఎంసీలు) ఉన్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 735 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. కుడి కాల్వ ద్వారా 19 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 841 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరిన్ని వార్తలు