కుండపోత..!

13 Aug, 2015 04:55 IST|Sakshi
కుండపోత..!

జిల్లాలో జోరుగా వర్షాలు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
వరద నీటిలో మునిగిన రహదారులు
రైతుల్లో హర్షాతిరేకాలు
వరినాట్లకు సిద్ధమైన రైతాంగం
 
 నిజామాబాద్ వ్యవసాయం : జిల్లాలో మూడు రోజులుగా కుండపోత వర్షాలు  కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు మోర్తాడ్, కమ్మర్‌పల్లి మినహ అన్ని మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ అర్బన్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురి సింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కురిసిన భారీ వర్షానికి బస్టాండ్, రైల్వే స్టేషన్, కంఠేశ్వర్, చంద్రశేఖర్ కాలనీ, ఆటోనగర్, నాగారం, ఇంద్రపూర్, వినాయక్‌నగర్, ఎల్లమ్మగుట్ట చౌరస్తానుంచి దేవి థియేటర్ రోడ్లతోపాటు ప్రధాన రోడ్లు, లోతట్టు వీధులన్నీ జలమయమయ్యూ రుు. జిల్లావ్యాప్తంగా సగటున ఐదు  సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

 వరి నాట్లకు చివరి అవకాశం
 ఈ వర్షం వరి సాగుకు ఊతమందించింది. జిల్లాలో మొన్నటి వరకు వర్షాలు కురవకపోవడంతో వరి వేసేందుకు రైతులు ముందుకు రాలేదు. ప్రస్తుతం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యూరు. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్ల మేర వరి సాగు చేస్తారని అంచ నా. ప్రస్తుతం 40వేల హెక్టార్లలో వరిసాగు చేపట్టారు. నాట్లు వేసేం దుకు చివరి అవకాశం కావడంతో మరో 50 వేల హెక్టార్లలో వరి సాగయ్యే అవకాశం ఉంది.

 ఆగస్టు 15 వరకు వేసిన నార్లు ఉంటే పంట బాగా పండుతుందని, అది కూడా చిన్న రకాలు పంట వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

 ఆరుతడి పంటలకు జీవం
 ఖరీఫ్ సీజను ప్రారంభం సమయంలో కురిసిన కొద్దిపాటి జల్లులకు రైతులు సాగు చేసిన ఆరుతడి పంటలు నీరు లేక వాడిపోయి, ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. మొక్కలు బతకవనే స్థితిలో ఉన్న సమయంలో వర్షాలు కురిసి వాటికి ప్రాణం పోసినట్లయింది. జిల్లాలో ఇప్పటి వరకు 1.27 లక్షల హెక్టార్లలో సోయా, 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 16వేల హెక్టార్లలో పత్తి, 20 వేల హెక్టార్లలో పెసర, మినుము, కంది ఇతర పప్పు ధాన్యాలు సాగు చేశారు. ప్రస్తుతం ఇవి బోరు కింద పం టలే అయినప్పటికీ... భూగర్భ జలాలు లేక అవి అంతంతమాత్రం గానే నీటిని అందించాయి. ప్రస్తు తం మూడు రోజు లుగా వర్షాలు భారీగా కురవడంతో ఆరుతడి పంటలకు ప్రా ణం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 ధ్వంసమైన ఇళ్లు
 నగరంలోని కురిసిన భారీ వర్షానికి కసాబ్‌గల్లిలోని అం కర్ లక్ష్మిబాయికి చెందిర పెంకుటిళ్లు కూలిపోయింది. కోజాకాలనీలని నాలుగు ఇళ్లు, బర్కత్‌పురలోని రెండు ఇళ్లు, నాగారంలోని రెండు ఇళ్లు వర్షానికి దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తలు