ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్‌ టవర్‌

22 Apr, 2019 19:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సికింద్రాబాద్‌, కుత్బులాపూర్‌, తిరుమలగిరి, ఉప్పల్‌, మేడిపల్లి, బొల్లారం, ముషీరాబాద్‌, కాప్రా, కొత్తపేట, చైతన్యపురి, నాచారం, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌లలో సోమవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కుప్పకూలింది. టవర్‌ రోడ్డు మీద పడటంతో దాని కింద చిక్కుకున్న ఒకరు మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతున్ని ఆయాకర్‌ భవన్‌లో పనిచేసే సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. గాయపడినవారిని నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ షెడ్‌ కూలిపోయింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరుగుతున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోధన్‌లో దారుణం

పాల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి

వేములవాడలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు

నగరవాసికి అందాల కిరీటం

స్వేదం...ఖేదం

ఎండకు టోపీ పెట్టేద్దాం..

రియల్‌ హీరో..

డజన్‌ కొత్త ముఖాలు

ప్రజలకు రుణపడి ఉంటాను

జగన్‌ పాలన దేశానికి ఆదర్శం కావాలి

తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను

ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

కరుణించని ‘ధరణి’

‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం!

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

గెలిచారు.. నిలిచారు!

రాహుల్‌ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

మోదం... ఖేదం!

డేంజర్‌ జోన్‌లో టీఆర్‌ఎస్‌: జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

అలసత్వమే ముంచింది!

18 స్థానాలు మైనస్‌

స్పీడు తగ్గిన కారు

చకచకా రెవెన్యూ ముసాయిదా చట్టం

ఎన్టీఆర్‌ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను