వీడని వాన..హైరానా

11 Oct, 2019 12:19 IST|Sakshi
కుత్బుల్లాపూర్‌ శ్రీనివాస్‌నగర్‌లో ఇంట్లోకి చేరిన నీటిని తొలగిస్తూ.., పంజగుట్ట ఫ్లై ఓవర్‌ కింద చేరిన వరద

నీట మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు

కుత్బుల్లాపూర్‌ అతలాకుతలం

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాలు సిటీని నిండా ముంచేస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గురువారం సైతం నగరంలో పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల 3 నుంచి 5 సెంటీమీటర్ల జడివాన కురిసింది. మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో ప్రధాన రూట్లలో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు వర్షపునీటిలో ఈదుకుంటూ భారంగా ముందుకు కదిలాయి. జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వరదనీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. వచ్చే 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు