నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం

15 May, 2015 23:36 IST|Sakshi

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కోస్తున్న వరి పనలు తడిసిపోయూరుు. పలు గ్రామాలలో స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. డిచ్‌పల్లి, బాన్సువాడ, బోధన్, జుక్కల్, సిరికొండ, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.

తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. లింగంపేట మండలం ముస్తాపూర్ వద్ద పిడుగు పడి ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులకు భయపడి 59 గొర్రెలు మృతి చెందారుు. గ్రామానికి చెందిన ఎర్ర గంగయ్య, నడిపి సాయిలుకు చెందిన గొర్రెలను కొట్టంలో ఉంచారు. శుక్రవారం వేకువజామున వె ళ్లి చూసే సరికి గొర్రెలు మృతి చెంది ఉన్నాయి. చనిపోరుున గొర్రెల విలువ రూ.3.86 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
 

మరిన్ని వార్తలు