ఈ ఏడాది మెరుగైన వర్షపాతం

7 Jun, 2017 02:18 IST|Sakshi
ఈ ఏడాది మెరుగైన వర్షపాతం
రుతుపవనాల అంచనాలను స్వల్పంగా పెంచిన ఐఎండీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకు ముందు వేసిన అంచనాల కన్నా ఈ ఏడాది వర్షపాతం మెరుగ్గా నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతు పవనాలపై సవరించిన అంచనాలను మంగళ వారం విడుదల చేసింది. ఈసారి సాధారణ వర్షపాతం కురుస్తుందని మరోసారి పేర్కొం ది. 96% వర్షాలు ఉంటాయని ఏప్రిల్‌ 18న ప్రకటించిన ఐఎండీ, దీర్ఘకాలిక సగటు వర్షపా తం(ఎల్‌పీఏ) 98% ఉంటుందని తాజా అంచనాల్లో తెలిపింది. అయితే ఈ అంచనా 4% అటు ఇటుగా ఉండొచ్చని పేర్కొంది. దీర్ఘ కాలిక సగటు వర్షపాతం 96% నుంచి 104 % మధ్య ఉంటే దాన్ని సాధారణమైనదిగా భావిస్తారు. 
 
‘ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వానలు కురుస్తాయని ఆశిస్తున్నాం. జూలైలో 96%, ఆగస్టులో 99% వర్షాలు పడే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ డెరెక్టర్‌ జనర ల్‌ కేజే రమేశ్‌ అన్నారు. రుతుపవనాల కదలి కలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ...అవి జూన్‌ 8న గోవా, జూన్‌ 13–14 నాటికి ముంబై, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌లలోకి ప్రవేశిం చొచ్చని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక సగటు వర్షపాతం వాయువ్యభారతంలో 96%, మధ్య భారత దేశంలో 100%, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో 99%, ఈశాన్య భారతంలో 96% ఉంటుందని ఐఎండీ ప్రకటనలో తెలిపింది. 
 
సాధారణం కన్నా తక్కువే: స్కైమెట్‌
స్కైమెట్‌ వెదర్‌ అనే ప్రైవేట్‌ వాతావరణ సంస్థ మాత్రం సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవన కాలంలో ద్వితీ యార్థంలో ఎల్‌నినో వృద్ధి చెందేందుకు 60% అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ కేంద్రాలు అంచనా వేస్తున్నాయని తెలిపింది. 
మరిన్ని వార్తలు