హైదరాబాద్‌లో భారీ వర్షం​

27 Jun, 2020 19:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, రాంనగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిలల్స్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పోల్చితే పాతబస్తీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పురాతన కట్టడం చౌమల్లా ప్యాలెస్‌ పాక్షికంగా దెబ్బతింది. రోడ్డు వైపు ఉన్న ప్యాలస్‌ ప్రహారీ గోడ కూలీపోయింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ అంతరాయ ఏర్పడింది. 

మరిన్ని వార్తలు