ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు

31 Aug, 2014 12:25 IST|Sakshi

ఖమ్మం: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు రిజర్వాయర్ లోని పెద్దఎత్తున నీరు రావడంతో 18 గేట్లు ఎత్తేసి 90 వేల క్యూసెక్కుల నీటికి దిగువకు వదిలారు.

కిన్నెరసాని, పెదవాగు, బయ్యారం చెరువు, వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకున్నాయి. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో వాజేడు-వెంకటాపురం మండలాల మధ్య ఉన్న చీకుపల్లి వాగు పొంగి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ముర్రేడు, ఏయ, ఆకేయ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు