తెలంగాణలో భారీ వర్షం..రైతులకు తీవ్ర నష్టం

24 Apr, 2015 10:01 IST|Sakshi
తెలంగాణలో భారీ వర్షం..రైతులకు తీవ్ర నష్టం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్య పంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ , నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.

నల్లగొండ: జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడలో ఈదురుగాలులతో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వందల ఎకరాల్లో వరి కి నష్టం వాటిల్లింది. నడిగూడెంలో మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. హుజుర్ నగర్ మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, పరిగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కూరగాయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వరంగల్: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిని పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నారావు పేట మండలంలో కోళ్ల షెడ్లు కూలి 50 వేల కోళ్లు మృత్యవాత పడ్డాయి. పలు చోట్ల పిడుగుపాటుతో 15 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

ఖమ్మం:  ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజక వర్గంలో అకాల వర్షంతో మామిడి పంటకు తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన కాపు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొండికొండ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరిన్ని వార్తలు