హైవేలపై సంక్రాంతి రద్దీ

12 Jan, 2020 02:11 IST|Sakshi

చౌటుప్పల్‌ /కేతేపల్లి/మహబూబ్‌నగర్‌ నెట్‌వర్క్‌: సంక్రాంతి పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లోని పలు జిల్లాల నుంచి అత్యధికంగా  ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద విజయవాడ మార్గంలో శనివారం కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా 16 మార్గాలు ఉండగా విజయవాడ వైపు పది ద్వారాలను తెరిచారు. యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద పాస్టాగ్‌ గేట్ల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వాహనాదా రులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులకు టోల్‌ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు.  

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు