కాలుష్య ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

4 Mar, 2018 04:55 IST|Sakshi
ఫార్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ

‘ఫార్మా’ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిం చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమ ల మంత్రి కె. తారకరామారావు హెచ్చరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందని ఆయన చెప్పారు.

శనివారం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (బీడీఎంఏ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ను తయారు చేసేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అందులో భాగంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సిటీ ఏర్పాటులో కాలుష్య సమస్య లేకుండా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను పాటిస్తున్నామన్నారు.  

‘ఔటర్‌’ వెలుపలికి కాలుష్య పరిశ్రమలు
హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌ రోడ్డు అవతలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కంపెనీలు పాలుపంచుకోవాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు పటాన్‌ చెరు, బొల్లారం ప్రాంతాల్లో చెరువులు, జలవనరుల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు