ఒక కోడి.. 150 గుడ్లు

19 Jul, 2019 06:46 IST|Sakshi

ఓ నాటుకోడి 6 నెలల్లో 150 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దేవల్‌తిర్మలాపూర్‌కి చెందిన రామకృష్ణమాచారి రెండేళ్ల కోడిపెట్ట గత 6 నెలలుగా 150 గుడ్లు పెట్టింది. నేటికీ పెడుతూనే ఉంది. ఈ విషయాన్ని రామకృష్ణమాచారి గ్రామస్తులకు తెలియజేయడంతో ఆసక్తిగా వచ్చి ఆ కోడిపెట్టను చూశారు. కొందరు గుడ్లను తీసుకెళ్లి తమ కోళ్లకు పొదుగేసుకున్నారు. ఈ విషయమై పశువైద్యాధికారిని అడగగా.. జన్యులోపం వల్ల లక్షల్లో ఒక కోడి ఇలా గుడ్లు పెడుతుందని తెలిపారు.  – పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్‌)
 

మరిన్ని వార్తలు