కరోనాకు ఆరోగ్యబీమా వర్తిస్తుందా? 

10 Apr, 2020 03:01 IST|Sakshi

తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వైద్య పరీక్షలు ఉచితంగా అందించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలకు అనుసరిస్తున్న విధానాన్ని తెలపాలని కోరింది. కరోనా వైద్యానికి బీమా అమలుకు ఐఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసిందో లేదో స్పష్టత ఇవ్వాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ నివారణ వైద్యం ఉచితంగా అందజేయాలంటూ న్యాయవాది  పి.తిరుమలరావు రాసిన లేఖను హై కోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గురువా రం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందజేయాలని కోరారు. వాదనల అనంత రం ధర్మాసనం పై విధంగా ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు