‘కరెంటు బిల్లుల మాఫీపై కౌంటర్ వేయండి’

22 Jun, 2020 15:36 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల లాక్‌డౌన్ విధించిన కాలానికి కరెంటు బిల్లులు మాఫీ చేయాలంటూ రాష్ట్ర హైకోర్టులో సోమవారం పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాదులు నరేశ్, సమీర్ వేసిన పిటిషన్ పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ పీడీసీఎల్ ను ఆదేశించింది.(శిల్పారెడ్డికి కరోనా వైరస్)

లాక్‌డౌన్ సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, శ్లాబులు తగ్గించి బిల్లుల భారం నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌నూ హైకోర్టు విచారించింది. కరెంటు బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా.. తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫిర్యాదుల కమిటీకి 6,767 ఫిర్యాదులు రాగా, 6,678 ఫిర్యాదులను పరిష్కరించినట్లు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. (ఆన్‌లైన్‌లో టెన్త్‌ ‘గ్రేడ్’‌ వివరాలు)

మరిన్ని వార్తలు