ఏది మాస్టర్‌ప్లాన్‌ : హైకోర్ట్‌

8 Aug, 2019 03:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమలులో ఉన్న మాస్టర్‌ప్లాన్‌ ఏదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఐదు మాస్టర్‌ప్లాన్‌లున్నాయని, అందులో ఒక్కటే హెచ్‌ఎండీఏ రూపొందించిందని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. అయితే, తొలి మాస్టర్‌ప్లాన్‌లోని విషయాలు చివరి మాస్టర్‌ప్లాన్‌లోనూ ఉంటాయా అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేయగా ఉంటాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సమాధానమిచ్చారు.

ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యా జ్యాలపై వాదప్రతివాదనలు ముగిశాయి. దీంతో తీర్పు ను తర్వాత వెలువరిస్తామని బు ధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ష మీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.   

>
మరిన్ని వార్తలు