సినిమా చూసేటప్పుడే తినాలా?

22 Aug, 2018 03:08 IST|Sakshi

మల్టీప్లెక్స్‌లోనే సినిమాకెందుకు వెళ్లాలి?: హైకోర్టు వ్యాఖ్య.. పిల్‌ కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌:మల్టీప్లెక్స్‌లోని సినిమా హాళ్లల్లోకి ప్రేక్షకులు తమ వెంట తినుబండారాలు తీసుకుని వెళ్లేలా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్టీప్లెక్స్‌లోని సినిమా హాళ్లల్లో ఆహార పదార్థాల నాణ్యత, అధిక ధరలు అంశాలపై వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆహార భద్రత, తూనికలు–కొలతలు, సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌లతో ముడిపడిన ఈ వ్యవహారంపై పిల్‌ ద్వారా న్యాయ సమీక్ష వీలుకాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా హాళ్లల్లో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని, ప్రేక్షకులే తమ వెంట ఆహార పదార్థాలను తీసుకువెళ్లేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది సతీశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు కొట్టివేసింది.

మరిన్ని వార్తలు