ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం

20 May, 2020 04:51 IST|Sakshi

గద్వాల గర్భిణి మృతిపై హైకోర్టు వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: గద్వాలకు చెందిన గర్భిణి జనీలాకు వైద్యం అందించని ఆస్పత్రుల యాజమాన్యాల నుంచే ఆమె కుటుంబానికి పరిహారం అందించాల్సి ఉంటుందని హై కోర్టు పేర్కొంది. కరోనా వైరస్‌ నివారణ వైద్యం చేయని ఆస్పత్రులు గర్భిణులకు, ఇతర అత్యవసర వైద్య సేవలను అంద జేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. వైద్యం అందించని ఏడు ఆస్పత్రుల వైఖరి క్షమించరానిదని వ్యాఖ్యానించింది. ప్రసవ వేదనతో బాధపడుతూ పలు ఆస్పత్రులకు తిరిగి చివరికి హైదరాబాద్‌లో పసికందుకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని న్యాయవాదులు కిశోర్‌కుమార్, శ్రీనిత పూజారి రాసిన లేఖలను హైకోర్టు పిల్స్‌గా పరిగణించింది. వీటిని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

మరిన్ని వార్తలు