ఇంటర్‌ ఫలితాల పిటిషన్లపై విచారణ ముగించిన హైకోర్టు

19 Jun, 2019 18:42 IST|Sakshi

సాక్షి, హైద్రాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తలెత్తిన గందరగోళ పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ ముగిసింది. ఫలితాల్లో చిన్న తప్పులే జరిగాయని, రీ వెరిఫికేషన్‌లో 0.16 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్న కోర్టు, చనిపోయిన వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది. అలాగే బాధ్యుల విషయంలో ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు