హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ

26 Oct, 2018 18:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ కేసుపై ఈ శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన హాయ్‌లాండ్‌ విలువను రూ. 550కోట్లుగా కోర్టు నిర్ణయించింది.  2022 వరకు గడువు ఇస్తే రూ. 8.500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతి పాదనను హైకోర్టు తోసి పుచ్చింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ భవనాన్ని విక్రయించగా వచ్చిన 11 కోట్ల రూపాయలను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు.

పీ సీఐడీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించగా, తెలంగాణ సీఐడి తెలంగాణలోని 195 అగ్రిగోల్డ్ అస్తుల విలువను కోర్టుకు సమర్పించింది. హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు