గ్రూప్‌ 2 ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించిన హైకోర్టు

20 Nov, 2019 15:26 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : గ్రూప్‌-2 కు సంబంధించిన ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం హైకోర్టు తెలిపింది .తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్‌ 2 కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్‌పీఎస్సీ వ్యవహరించిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైట్నర్‌, ట్యాంపరింగ్‌, స్క్రాచింగ్‌ చేసిన అభ్యర్థులను సెలక్ట్‌ చేయొద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతో గ్రూప్‌ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్‌ చేసి ప్రొవిజనల్‌ లిస్ట్‌​ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు