బూట్లపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

27 Jun, 2017 20:00 IST|Sakshi
బూట్లపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

- సింగరేణి కాలరీస్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని కార్మికులకు నాణ్యత లేని బూట్లు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కేందర గనులశాఖ కార్యదర్శి, భారత ప్రమాణాల డైరెక్టర్ జనరల్, సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్, రాష్ట్ర గనులశాఖ ముఖ్యదర్శి, బూట్ల సరఫరా కంపెనీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి టి. రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సింగరేణి కాలరీస్ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్‌) అధికారులు, బూట్లు సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులు కుమ్మకై నాణ్యత లేని బూట్లను సరఫరా చేస్తున్నారంటూ కార్మిక సంఘం ‘ఎ సోషల్‌ బాడీ ఫర్‌ మైనింగ్‌ వర్కర్స్‌’ అధికార ప్రతినిధి ఓం శాంతి బృహన్నల హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించిన ధర్మాసనం విచారణ జరిపింది.

మరిన్ని వార్తలు