‘బీడీ ఆకుల’ అనుమతి నిరాకరణపై రిట్‌

25 May, 2019 02:34 IST|Sakshi

అటవీ శాఖకు హైకోర్టు నోటీసు

సాక్షి, హైదరాబాద్‌: బీడీ ఆకుల సేకరణకు ఈ–వేలం పొందిన తర్వాత పాత బకాయిలున్నాయని చెప్పి బీడీ ఆకుల సేకరణకు అనుమతించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. టైగర్‌ కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో బీడీ ఆకుల సేకరణకు అనుమతినిస్తూ గత ఏప్రిల్‌లో తెలంగాణ అటవీ శాఖ అనుమతి ఇచ్చిందని, అయితే 2017 ఏడాది నాటి బకాయిలున్నాయని చెప్పి ఇప్పుడు అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాంట్రాక్టర్‌ పి.సంపత్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. ప్రతివాది అయిన అటవీ శాఖకు నోటీసులు జారీ చేసింది. 2017లో బీడీ ఆకుల సేకరణ వల్ల కాంట్రాక్టర్లందరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లారని, బీడీ ఆకుల సేకరణకు అనువైన మే నెల దాటితే వర్షాలు పడి తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అటవీ శాఖ వాదనలతో కౌంటర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది

మరిన్ని వార్తలు