పోలీసు, న్యాయవ్యవస్థ నాణేనికి రెండు ముఖాలు

29 Oct, 2019 02:09 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు, న్యాయవ్యవస్థలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాజాబహద్దూర్‌ వెంకటరామిరెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్‌) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 2019 కొత్త ఎస్సై(సివిల్‌) బ్యాచ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ, పోలీస్‌ విధుల్లో వ్యత్యాసమున్నా లక్ష్యం ఒక్కటేనన్నారు. పోలీసు అధికారులు సమాజం పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులతో వచ్చే ప్రజలతో సహనంతో వ్యవహరించాలన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులతోపాటు, చట్టాలన్నింటిపైనా పట్టు సాధించాలని సూచించారు. బృంద స్ఫూర్తి, స్మార్ట్‌వర్క్, సిటిజన్‌ ఫ్రెండ్లీ విధానాలకనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ముడిరాళ్లను వజ్రాలుగా సానబెట్టే అవకాశం టీఎస్‌పీఏకి వచ్చిందని పోలీసు అకాడమీ డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రైనీ ఎస్సైలకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్‌ బి.నవీన్‌కుమార్‌.. టీఎస్‌పీఏ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ జానకీషర్మిల తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆరేళ్లుగా కారు హ్యాపీ జర్నీ

ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్‌

డబ్బా ఇసుక రూ.10

‘నీరా’ వచ్చేస్తోంది

మీరు హాస్టల్­లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!

అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి

ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే!

ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె: జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి

ఖమ్మంలో మహిళా కండక్టర్‌ ఆత్మహత్య

తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం

సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి కన్నుమూత

నాగార్జునసాగర్‌ ఆరు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేత

ఈనాటి ముఖ్యాంశాలు

టైర్ల గోదాంలో ఎగిసిపడ్డ అగ్ని కీలలు

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఎండీకి లేఖ

‘కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కింది’

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

'ఆర్టీసీ సమస్య ప్రభుత్వమే చూసుకుంటుంది'

‘మేరీ గోల్డ్‌’ కేజీ రూ.800 

గంట లేటుగా వచ్చామనడం అబద్ధం..

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన సర్పంచ్‌

లిక్కర్‌ కాదు..లైబ్రరీ కావాలి

జిల్లాలో చీలిన ‘తపస్‌’

గుట్టల్లో గుట్టుగా గంజాయి సాగు 

మున్సిపాలిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు

రైళ్లలో టపాసులు తీసుకెళ్తే అంతే సంగతి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

స్టార్స్‌ సందడి

నేను హీరో ఏంటి అనుకున్నా

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

కొత్తగా వచ్చారు