జోగుళాంబ క్షేత్రంలో హైకోర్టు జడ్జి

30 Jul, 2018 14:58 IST|Sakshi
స్వాగతం పలుకుతున్న అధికారులు, అర్చకులు     

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌):  తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం హైకోర్టు జడ్జి వెంకటశేష సాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ ఈఓ నరహరి గురురాజ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు.

అనంతరం జోగుళాంబ అమ్మవారికి శ్రీచక్రార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారకి క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. వీరి వెంట కర్నూలు జిల్లా జడ్జి అననుపమచ్రక్రవర్తి, కర్నూలు అడిషనల్‌ జిల్లా జడ్జి శ్యాంప్రసాద్, కర్నూలు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ రావు, అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఏ.రాధిక, ఎస్‌.ఐ గడ్డంకాశి , ఏ.ఎస్‌.ఐ సుబ్బారెడ్డి కోర్టు జూనియర్‌ అసిస్టెంట్‌ చిన్నరాజు, పుష్పప్రియ, గిరి ఉన్నారు.  

మరిన్ని వార్తలు