మున్సిపల్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

22 Nov, 2019 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్టే ఉన్న 77 మున్సిపాలిటీలకు విడివిడిగా వాదనలు వినాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అన్నింటికీ కలిపి ఒకే కౌంటర్‌ దాఖలు చేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వార్డుల విభజన, జనాభాకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని వారు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై వచ్చిన అభ్యంతరాలను డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసిందని పేర్కొన్నారు. స్టేలు ఉన్న 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: మున్సిపల్‌ స్టేల రద్దుకు నో)

మరిన్ని వార్తలు