శ్రామిక్‌ రైళ్లను అడగడం లేదేంటి?

10 Jun, 2020 05:14 IST|Sakshi

కేంద్రం ఏర్పాటు చేస్తామన్నా వినియోగించుకోరా? 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు 

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికుల్ని వారి రాష్ట్రాలకు పంపేందుకు రైల్వేశాఖ కోరిన వెంటనే శ్రామిక్‌ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎం దుకు ఆ అవకాశాల్ని వినియోగించుకోవడం లేదని హై కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లు కావాలని దరఖాస్తు చేయలేదని రైల్వేశాఖ తరఫు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల తరలింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వాటి సంబంధిత ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్‌ లెక్చరర్‌ జీవన్‌కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది.

ఒక్క రోజులోనే శ్రామిక్‌ రైలు ఏర్పా టు చేస్తామని కేంద్రం చెబుతున్నా రాష్ట్రంలోని ఒక్క జిల్లా కలెక్టర్‌ కూడా దరఖాస్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తంచేసింది. దీనిపై పూర్తి వివరాలు బుధవారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. వివిధ జిల్లాల్లోని ఇటుక బట్టీ కార్మికులు 9 వేల మంది వరకూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వేప్లాట్‌ ఫారాలు, రైళ్లు కిక్కిరిసిపోయాయని పిటిషనర్‌ న్యాయవాది వసు ధా నాగరాజ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారని, బిహార్‌కు ఒక్క రైలును మాత్రమే నడపడంతో 24 బోగీలూ కిటకిటలాడుతూ వెళ్లాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మా సనం, ఆహారం, వసతి, వై ద్యం, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించాలని తా ము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తామిచ్చే ఉత్తర్వులు ప్రజాహితం కో సమేనని, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా కారాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. çకరోనాపై పి ల్స్‌ దాఖలైతే అవి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబోవని, ప్రజాహితంగా చూడాలని సూచించింది. ప్రభు త్వ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేసినట్టు అడ్వొ కేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. విచారణ నేటికి వాయి దా  పడింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు