ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

6 Dec, 2019 22:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరిఫ్‌, నవీన్‌, చెన్నకేశవులు, శివల మృతదేహాలను ఈ నెల 9 వరకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. శవపరీక్ష వీడియోను జిల్లా జడ్జికు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.  ఎన్‌కౌంటర్‌పై హౌస్‌ మోషన్‌ పిల్‌ ఆధారంగా హైకోర్టు స్పందించింది. కాగా ఈ నెల 9న ఉదయం 10:30 నిమిషాలకు కేసు విచారణను చేపడతామని హైకోర్టు వెల్లడించింది.
(చదవండి : ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా