ఆర్టీసీ సమ్మెపై వాడీవేడి వాదనలు.. కీలక ఆదేశాలు

6 Oct, 2019 18:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులను ఈనెల 10న తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి.. న్యాయవాదుల వాదనలు విన్నారు. సమ్మె చట్టబద్ధంకాదని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదించారు. ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని... సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని హైకోర్టుకు నివేదించారు. పండగ సమయంలో కార్మికులు ఇలా సమ్మె బాటపట్టడం సరికాదన్న న్యాయవాది.. అయినా కూడా ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. వెంటనే సమ్మెను విరమింపజేసేలా ఆదేశాలు ఇ‍వ్వాలని న్యాయమూర్తిని కోరారు. గంటపాటు వాదనలు విన్న న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి.. సమ్మెపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. హైకోర్టుకు ప్రస్తుతం సెలవులు కావడంతో కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసంలో పిటిషన్‌పై విచారణ జరిగింది.

మరిన్ని వార్తలు