భవన యజమానులపై చర్యలేం తీసుకున్నారు?

21 Dec, 2016 03:14 IST|Sakshi

పార్కింగ్‌కు అవకాశం లేకుండా చేయడంపై హైకోర్టు సీరియస్‌
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనేక భవనాలను వాణిజ్య సము దాయాలుగా మార్చి, పార్కింగ్‌కు అవ కాశం లేకుండా చేస్తున్న భవన యజ మానులపై ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించాలని హైకోర్టు మంగళ వారం పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణ ను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకరనారాయణ ఉత్త ర్వులు జారీ చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధి లో పలు భవనాల్లోని పార్కింగ్‌ ప్రాంతా లను వాణిజ్య సముదాయాలుగా మార్చే శారని, దీంతో చాలామంది వాహనాల్ని రోడ్లపై పార్క్‌ చేస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయంటూ పత్రి కల్లో కథనాలు వచ్చాయి. హైకోర్టు, వీటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారిం చింది. పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు