తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

15 Jul, 2020 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వచ్చిన వారికి ప్రభుత్వం ఎలాంటి చికిత్స అందిస్తోందో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. కరోనా చికిత్సకు సంబంధించి హైకోర్టు నేడు విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కింగ్ కోఠి, గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో అత్యవసర పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. లక్షణాలు తక్కువగా ఉన్నవారికి పేషెంట్లకు సరోజిని దేవి, ఆయుర్వేదిక్,  నేచర్ క్యూర్‌ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ప్రసార మాధ్యమాల్లో ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్‌ చెప్పిన సూచనలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు