ఇంటర్‌ బోర్డుపై టీఎస్‌ హైకోర్టు సీరియస్‌

17 Feb, 2020 18:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నారాయణ, చైతన్య కళాశాలలకు సంబంధించి ఇంటర్‌ బోర్డు సమర్పించిన నివేదిక పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందు పరచలేదని హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించింది. ‘నారాయణ, చైతన్య కళాశాలలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు.. కళాశాలల్లో వసతులు, ఇప్పటి వరకు కళాశాలల్లో ఎంత మంది విద్యార్థులు మృతి చెందారు’ వంటి పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని ఇంటర్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టులో పిల్‌..
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని పిల్‌లో పేర్కొన్నారు. జీవోలను ఎందుకు వెబ్‌సైట్‌లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
(దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ)

మరిన్ని వార్తలు