ఆ ఎన్‌కౌంటర్‌పై అమికస్ క్యూరీ: హైకోర్టు

20 Jan, 2015 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడికి పాల్పడిన యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా ఓ న్యాయవాదిని నియమించాలని హైకోర్టు సోమవారం నిర్ణయించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 
 ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008, డిసెంబర్ 13న వరంగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చేశారంటూ ఎస్.శ్రీనివాసరావు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత చైతన్య 2008లో హైకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు