శివశంకర్‌కు హైకోర్టు ఘన నివాళి

3 Mar, 2017 00:23 IST|Sakshi
శివశంకర్‌కు హైకోర్టు ఘన నివాళి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ న్యాయమూర్తి, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి పి.శివశంకర్‌కు ఉమ్మడి హైకో ర్టు గురువారం ఘన నివాళులు అర్పించింది. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలను కొనియాడింది. శివశంకర్‌కు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఏసీజే మాట్లాడుతూ బలహీనవర్గాల అభ్యున్నతికి శివశంకర్‌ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మృతి న్యాయవ్యవస్థకు తీరని లోటన్నారు. తరువాత తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. శివశంకర్‌ ఎంతో కష్టపడి పని చేసేవారని, ప్రతీ అంశాన్ని చాలా లోతుగా అధ్యయ నం చేసే వారని అన్నారు. ఆయన సేవలను న్యాయ వ్యవస్థ ఎన్నడూ మరవదన్నారు.

 సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం శివశంకర్‌ చేసిన కృషి అని తర సాధ్యమని ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని వెం కటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, ఏపీ, తెలంగాణ న్యాయవాద సంఘాల అధ్యక్షులు సి.నాగేశ్వరరావు, గండ్ర మోహ నరావు తదితరులు పాల్గొన్నారు. శివశంకర్‌ మృతిపై బార్‌ కౌన్సిల్‌ తన సంతాపాన్ని తెలిపింది.

మరిన్ని వార్తలు