శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా

28 Jun, 2017 08:17 IST|Sakshi
శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా

హైదరాబాద్ :
బ్యూటీషియన్ శిరీష మృతికేసులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా సాగింది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత నిందితులు రాజీవ్, శ్రావణ్లను బంజారాహిల్స్ పీఎస్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లారు.

రాత్రి 1:20 గంటలకు ఉస్మానియాలో రాజీవ్, శ్రావణ్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా వద్ద మీడియా కళ్లుగప్పి కుకునూర్‌పల్లి తీసుకువెళ్లారు. తెల్లవారుజామున 3:30 గంటలకు కుకునూర్‌పల్లి చేరుకున్నారు. పోలీసులు మీడియాను చూసి కుకునూర్‌పల్లి పీఎస్కు వెళ్లకుండా సిద్దీపేట వైపు 25 కి.మీ వెళ్లారు. కుకునూర్‌పల్లి రోడ్డుపై 45 నిమిషాలసేపు రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తిప్పారు. ఉదయం 4:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వైపు రాజీవ్, శ్రావణ్లను తరలించారు. ఉ.5:30కి రాజీవ్, శ్రావణ్ను బంజారాహిల్స్ పీఎస్కు తీసుకువచ్చారు.

బుధవారం ఏ క్షణంలోనైనా రాజీవ్, శ్రావణ్లను కుకునూర్‌పల్లి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్లో ఏం జరిగిందో నమోదు చేయనున్నారు. రాజీవ్, శ్రావణ్లను రెండ్రోజులు పోలీసులు విచారించారు. రాజీవ్, శ్రావణ్లు చెప్పిన వివరాలపై కేసును రీ కన్స్ట్రక్షన్ చేసేపనిలో పోలీసులు ఉ‍న్నారు.

మరిన్ని వార్తలు