ఒక్కసారి గెలిస్తే బిందాస్‌

15 Dec, 2018 09:05 IST|Sakshi

 పదవిలో ఉన్నప్పుడు భారీగా వేతనాలు, సదుపాయాలు

మాజీగా మారినా తగ్గని సౌకర్యాలు

ఖమ్మం, మయూరి సెంటర్‌: పేరుకు పేరు, హోదా, గౌరవం, ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ కిక్కే వేరు. అందుకే ఎన్నికల్లో పోటీచేయాలని, అసెంబ్లీలో ఒక్కసారైనా అధ్యక్షా అంటే చాలనుకునే వారు కొందరు. ఇందుకు ఎన్ని తలనొప్పులు ఎదురైనా,ఎంతో డబ్బు ఖర్చయినా వెనుకడుగు వేయరు. అయితే ఎమ్మెల్యేగా గెలిస్తే పదవిలో ఉన్నప్పడే కాదు, మాజీలుగా మారిన తర్వాత కూడా ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలు పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే వారు జీవితాంతం బిందాస్‌ బతికేయవచ్చు. దీనికి కారణం వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవ వేతనాలు ఇందుకు నిదర్శనం. వాటి వివరాలు తెలుసుకుందాం.

4,120 అసెంబ్లీ సెగ్మెంట్లు..
దేశంలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటి పరిధిలో 4,120 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి వేలమంది పోటీపడుతూ ఉన్నారు. కొందరు ఒకటి,రెండు సార్లు గెలిస్తే, మరికొం దరు చాలా సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేస్తుంటారు. కానీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన, కొంతకాలం పదవిలో ఉన్నా సరే వారు ఇక జీవితాంతం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.ç ³దవిలో ఉన్నంత కాలం భారీగా వేతనాలు, అలవెన్సులు ఉంటాయి. ఎక్కyì కి వెళ్లినా, ఏ  ఖర్చు అయినా దాదాపు ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. వారు పదవిలోంచి దిగిపోతే మాజీ ఎమ్మెల్యే హోదాలో జీవితాంతం పెస్షన్, ప్రభుత్వ సౌకర్యాలెన్నో అందుతాయి.

మాజీగా మారినా..
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి నెలకు 30,000 రూపాయలు పెన్షన్‌ అందుతుంది. వాహన ఖర్చులకు 8,000 రూపాయలు, జీవితాంతం ఉచిత వైద్య సౌకర్యాలు అందుతాయి. ఐదేళ్ల గడువుతో సంబంధం లేకుండా కనీసం ఒకరోజు పదవిలో ఉన్నా, ఇవన్నీ అందుతాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ అలవెన్సులు దాదాపు ఒకేలా ఉన్నాయి. రెండోసారి అంతకంటే ఎక్కువ గెలిచిన వారికి పెన్షన్‌కు అదనంగా ఏడాదికి మరో 1,000 రూపాయల చొప్పున గరిష్టంగా 50,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఒకవేల మాజీ ఎమ్మెల్యే గనుక చనిపోతే వచ్చే పెన్షన్‌ను అతడి భార్యకు కూడా సమానంగా ఇస్తారు.

వేతనాల్లో తెలంగాణే టాప్‌
ప్రతి ఎమ్మెల్యేకు నెలకు ఇంతని వేతనంతో పాటుగా అలవెన్సుల కింద కొంత సొమ్ము అందజేస్తారు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధం గా ఉండదు. అయితే ఎమ్మెల్యే జీతభత్యాలలో మన తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉంది. మన రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 2,50,000 రూపాయలు జీతంగా ఇస్తారు. దేశంలో అత్యల్పంగా త్రిపుర ఎమ్మె ల్యేకు 34,000 రూపాయలు అందుతాయి. ఎమ్మెల్యేలకు అదే మొత్తం లో వేతనంతో పాటుగా అలవెన్సులు కలిపి ఉంటాయి. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 2,50,000 చెల్లిస్తుండగా, అందులో 20,000 జీతం కాగా.. 2,30,000 నియోజకవర్గ అలవెన్సుల కింద ఇస్తారు. అధేవిధంగా వారి వాహనాల కొను గోలుకు 30,00,000 వరకు లోన్‌ రూపంలో ఇవ్వటం జరగు తుంది. 2016 మార్చి 29వ తేదీన దీనికి సంబంధించిన బిల్లు తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందింది.

యూపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 1,87,000 చెల్లిస్తుంటే, అందులో 75,000 జీతం, 24,000 డీజీల్‌ ఖర్చులకు, 6,000 పర్సనల్‌ అసిస్టెంట్, 6,000 మొబైల్‌ ఖర్చులకు, మిగతా మొత్తాన్ని ఇతర ఖర్చులకు ఇస్తారు. ఇవే కాకుండా ప్రభుత్వ అతిధి గృహాల్లో ఉచిత భోజన వసతి సౌకర్యాలు, నియోజకవర్గంలో పర్యటనలకు వెళ్లిన ఖర్చుల బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైళ్లలో ఎమ్మెల్యేతో పాటుగా మరొకరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. గత ఏడేళ్లలో ఎమ్మెల్యేల జీతభత్యాలు సగటున యూపీలో 125 శాతం, ఢిల్లీలో 450 శాతం, తెలంగాణలో 170 శాతం పెరగటం విశేషం.

మరిన్ని వార్తలు