శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు

11 Aug, 2018 07:36 IST|Sakshi
ఓఆర్‌ఆర్‌పై డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని చితకబాదుతున్న హిజ్రాలు (ఫైల్‌)

ఒంటరిగా వెళ్తే అడ్డగించి మరీ దోచుకోవడమేరెండ్రోజుల క్రితం నార్సింగ్‌ సబ్‌రోడ్డులో దాదాగిరి

డబ్బులు ఇవ్వని వారిపై దాడులకు తెగబడుతున్న వైనం

కొందరు మాత్రమే ఇలా..

రాజేంద్రనగర్‌: హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఏదైనా శుభకార్యం, దుకాణాల ప్రారంభోత్సవం జరిగితే వచ్చి నజరానా తీసుకోని వెళ్లేవారు.  కానీ ఇప్పుడు గ్యాంగులుగా ఏర్పడి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రెండు రోజుల క్రితం నలుగురు హిజ్రాలు నార్సింగి సబ్‌రోడ్డులో దారిగూండా వెళ్తున్నవారిని అడ్డగించి అందిన కాడికి దోచుకున్నారు. మంచిరేవులకు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొందరు హిజ్రాలు ఉన్నప్పటికీ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

గుంపులు గుంపులుగా..
హిజ్రాలు గ్యాంగులుగా ఏర్పడి నానా హడావిడి సృష్టిస్తున్నారు. ఒకొక్క గ్యాంగులో నాలుగు నుంచి 10 మంది సభ్యులు ఉంటున్నారు. ఆటోల్లో తిరుగుతూ ఎక్కడ శుభకార్యం జరిగిన వాలిపోతున్నారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు వెలికి చేష్టలు చేస్తూ ఇబ్బందులు సృష్టిసుంటారు. వారు అడిగిన డబ్బు ఇచ్చేంత వరకు విడవడం లేదు. దీంతో నయానో.. బయానో సముదాయించి డబ్బును అందజేస్తున్నారు. పెళ్లి చేసేవారి వారి స్థాయిని బట్టి రూ. 5 నుంచి రూ. 25 వేల వరకు, గృహప్రవేశాలకు రూ. 5 నుంచి రూ.10 వేలు, ఇతర ఏ శుభకార్యాలు చేపట్టిన రూ. 5 వేల వరకు డిమాండ్‌ చేసి మరి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. అసభ్యకరపదజాలంతో తిడుతూ శాపనార్థాలు పెడుతూ రోడ్లపై హంగామా చేస్తారు.

మరిన్ని వార్తలు