హిందూ సమాజం శక్తిమంతం కావాలి

25 Dec, 2019 02:06 IST|Sakshi

ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ శ్యాంకుమార్‌ 

భారత్‌ కళాశాలలో  విజయ సంకల్ప శిబిరం ప్రారంభం

ఇబ్రహీంపట్నం రూరల్‌: హిందూ సమాజం శక్తిమంతం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యాంకుమార్‌ అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చే యడానికి సేవక్‌లు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ ఎస్‌) విజయ సంకల్ప శిబిరం మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆ దిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి భా రత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రారంభమైంది. శిబిరానికి 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్యాంకుమార్‌ మాట్లాడుతూ.. హిందూ సమా జం వెయ్యేళ్లు బానిసత్వంలో గడపడానికి ప్రధాన కారణం హిందువుల అనైక్యతే అన్నారు. ప్రతి హిందువు ఈ భూమిని రక్షిస్తూ.. దర్మాన్ని కాపాడుకోవాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ స హ్‌ కార్యవాహ్‌ ముకుందా, క్షేత్ర సహ సంఘ చాలక్‌ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘ చాలక్‌ దక్షిణామూర్తి, ఎంపీలు బండి సంజయ్, అరి్వంద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ హాజరు
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌ మంగళవారం సాయంత్రం శిబిరానికి హాజరయ్యారు. బుధవారం ఉదయం 5 గంటలకు స్వయం సేవక్‌ల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు