మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

21 Aug, 2019 07:43 IST|Sakshi

కారులో హీరో రాజ్‌తరుణ్‌ ఉన్నారంటున్న స్థానికులు

హైదరాబాద్‌: నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో సైతం ఆ సినీ నటుడి పోలికలు ఉన్న వ్యక్తి ఉండటంతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది. 

నార్సింగి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్‌ 09 ఈఎక్స్‌ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ పూర్తి సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సంఘటన సమ యంలో రాజ్‌తరుణ్‌ కారులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయమై నార్సింగి పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం విచారిస్తున్నామని చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నంబర్‌ ఆధారంగా స్కేజోన్‌ యజమానికి సమాచారం అందించామని చెప్పారు. యజమాని అనుచరుడు ఫోన్‌లో సంప్రదించాడని, కానీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ‘మీ సేవలు’ చాలు

‘నల్లమల సందర్శనకు అనుమతించండి’ 

నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ 

హెచ్‌సీయూలో ఉద్రిక్తత 

రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

నేడు, రేపు రాష్టంలో మోస్తరు వర్షాలు 

రాష్ట్రంలో కార్లు, బైక్‌ల దూకుడు

చెరువు ఎండిపాయే..

కృష్ణమ్మ తియ్యగా..గోదావరి చప్పగా..! 

మల్టీ‘ఫుల్‌’ చీటింగ్‌

మళ్లీ ‘ఆరోగ్యశ్రీ’ 

‘ప్రక్షాళన’ ఏది?

స్వీట్‌ బాక్సుల్లో రూ.1.48 కోట్లు

అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు

కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?

23న రాష్ట్రానికి అమిత్‌ షా రాక

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం, మంత్రుల పేరిట పార్సిల్స్‌ కలకలం

‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు ఊరట

విసిగిపోయాను..అందుకే ఇలా..

‘కేటీఆర్‌ ప్రాస కోసం గోస పడుతున్నారు’

అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై ఆగ్రహం

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

మల్లన్న సాగర్‌ : హైకోర్టు సంచలన తీర్పు

‘మీ సేవ’లో బయోమెట్రిక్‌ విధానం

ప్రశ్నార్థకంగా ఖరీఫ్‌!

వాటర్‌ హబ్‌గాచొప్పదండి

ఆపరేషన్‌ లోటస్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌