సమష్టి కృషితో  లక్ష్యాన్ని అధిగమించాలి 

9 Dec, 2018 13:11 IST|Sakshi

 మణుగూరు ఏరియా జీఎం  నర్సింహారావు  

మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):  సింగరేణి అధికారులు, కార్మికులు సమష్టి కృషితో ఏరియా 2018–19 ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని ఏరియా జీఎం సీహెచ్‌ నర్సింహారావు అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల, డిపార్ట్‌మెంట్‌ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని సూచించారు. రక్షణ విషంలో అన్ని గనుల కంటే మణుగూరు ఏరియాను ముందుంచాలన్నారు. ఏరియా ఉత్పత్తి లక్ష్యాలకు సంబంధించిన నాణ్యతా, పనిగంటలు, ఉత్పత్తి వ్యయం, గనులు, ఏరియా లాభ నష్టాలు, సాధించాల్సిన ఉత్పత్తికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.

అధేవిధంగా భూగర్భ గనుల్లో యంత్రాల వినియోగంపై తగు సలహాలు, సూచనలు చేశారు. బొగ్గు రవాణా, నాణ్యత, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉత్పత్తి ఖర్చు, లక్ష్య సాధనకు కార్యాచరణ వంటి తదితర అంశాలను విరించారు. ఏరియాకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, మ్యాన్‌ పవర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రమేష్‌రావు, ఏరియా ఇంజనీర్‌ డీవీఎస్‌ఎన్‌ రాజు, డీజీఎం ఐఈడీ రవి, ప్రాజెక్టు అధికారులు లక్ష్మీపతిగౌడ్, లలిత్‌కుమార్, శ్రీహరి, డీజీఎం వర్క్‌షాప్‌ నర్సిరెడ్డి, ఫైనాన్స్‌ వెంకరమణ, పర్సనల్‌ మేనేజర్‌ రేవు సీతారాంతో పాటు సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, అన్ని గనుల అధికారులు  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు