పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్

1 Apr, 2014 16:05 IST|Sakshi
పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్

నిన్న మొన్నటి వరకు కేవలం వైద్యవిద్యా కోర్సుల్లో మాత్రమే హైటెక్ కాపీయింగ్ జరిగేది. గురివిరెడ్డి గ్యాంగు పలు సందర్భాల్లో ఇలాంటి కాపీయింగ్ రాకెట్ను నడిపిస్తూ పట్టుబడింది. సరిగ్గా ఇలాంటి కోవలోనే పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్న గ్యాంగు ఒకదాన్ని 'సాక్షి' బట్టబయలు చేసింది. వరంగల్ నగరంలో ఒక ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో ఈ హైటెక్ కాపీ రాకెట్ నడిచింది.

ఈ విషయమై కొందరు విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న 'సాక్షి' ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించి, రహస్య కెమెరాలతో రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. పరీక్ష హాలు వెలుపల ఒక కారులో కొంతమంది కూర్చుని ఉండటం, లోపల పరీక్ష రాసేవాళ్లు బ్లూటూత్ సాయంతో ప్రశ్నపత్రంలో ఏముందో వీళ్లకు చెప్పడం ద్వారా ఈ మొత్తం కాపీ వ్యవహారం నడిపించారు. బయట కారులో ఉన్నవాళ్లు పాఠ్యపుస్తకాలు, గైడ్లలో ఉన్న సమాధానాలను లోపల ఉన్నవాళ్లకు చెబుతున్న వైనం మొత్తం 'సాక్షి' నిఘాలో బయటపడింది.

మరిన్ని వార్తలు