వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం

28 Sep, 2015 22:02 IST|Sakshi

యాజమాన్యం అగ్రిమెంట్ ప్రకారం వేతనాలను చెల్లించకపోతే.. సమ్మెకు సైతం వెనుకాడేది లేదని హెచ్‌ఎంఎస్ కార్మిక నేత, హోంమత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. హెచ్‌ఎంటీ కాలనీలోని హెచ్‌ఎంటి ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన హెచ్‌ఎంఎస్ పరిశ్రమ కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యలరైజ్ చేయడం లేదని, రైగ్యులరైజ్ చేయాలని అడిగిన వారిని విధుల్లో నుండి తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేతన ఒప్పందం ప్రకారం సమాన వేతనాలతో పాటు, కార్మికులందరిని రైగ్యులరైజ్ చేయనట్లయితే లేబర్ యాక్ట్ 303 ప్రకారం సమ్మెకు సిద్దంగా ఉండాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఆర్ మూర్తి, కార్మికులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు