హోలీ వేడుకల్లో ఒకరి హత్య

7 Mar, 2015 01:15 IST|Sakshi
హోలీ వేడుకల్లో ఒకరి హత్య

వివాహేతర సంబంధమే కారణం
ఇద్దరిపై కేసు నమోదు

 
భీమారం : హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తన రక్తసంబంధీకురాలితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడనే నెపంతో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసిన సం ఘటన నగంరలోని భీమారంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కరీం నగర్ జిల్లా కేశవపూర్‌కు చెందిన ఎ. రవికుమార్(43)కు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం రవికుమార్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 20 ఏళ్ల క్రితం హసన్‌పర్తిలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా స్థా నిక మహిళతో రవి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాన్ని  భీమారానికి  మా ర్చాడు.ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు భీమారంలో అతడు హోలీ సంబరాల్లో ఉండగా అక్కడికి హసన్‌పర్తికి చెం దిన ప్రసాద్ వెళ్లాడు. అతడితోపాటు భీమారానికి చెందిన జితేందర్ జతయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ తన రక్తసంబధీకురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడనే కోపంతో ప్రసాద్ అతడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అతడి దాడిలో రవికుమార్ కుప్పకూలాడు.

దీంతో భయపడిన ప్రసాద్ తన స్నేహితుడు అనిల్ సహకారంతో ద్విచక్ర వాహనంపై రవికుమార్‌ను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికీ తీసుకెళ్లాడు. అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి వైద్యు లు నిరాకరించారు.దీంతోఎంజీఎంఆస్పత్రికితీసుకెళ్లారు అప్పటికే భయంతో ప్రసాద్ ఆస్పత్రి బయటే ఉండగా, రవి కుమార్‌ను అనిల్ స్ట్రెచర్‌పై క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేయగా వైద్యులు అతడిని గమనించి వివరాలు అడిగారు. జరిగిన సంఘటనను అనిల్ వైద్యులకు చెప్పాడు. వారు రవికుమార్‌ను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు.

పోలీసులకు అప్పగింత

కాగా అనిల్‌ను ఔట్‌పోస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూసీ పోలీసులకు సమాచారంఇచ్చారు.విషయం తెలుసుకున్న కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి మార్చురీకి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. వివాహేతర సంబంధం కారణంతోనే హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రసాద్, జితేం దర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనిల్ కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, రవికుమార్‌ను ఆస్పత్రికి తరలించడానికి మాత్ర మే సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నప్రసాద్ హ న్మకొండ మార్కెట్‌లో కూరగాయాల వ్యాపారం చేస్తుండగా, మరో నిందితుడు జితేందర్ సైతం భీమారంలో కూరగాయలు అమ్ముతున్నాడు.  

మరిన్ని వార్తలు