‘లాక్‌డౌన్‌’లో గృహ విద్యుత్‌ వాడకం పెరిగింది

7 Jun, 2020 01:50 IST|Sakshi

అదే విద్యుత్‌ బిల్లులు పెరగడానికి కారణం

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా 3 నెలలు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం, ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో గృహ విద్యుత్‌ వినియోగం పెరిగి బి ల్లుల పెరుగుదలకు కారణమైందని దక్షిణ తెలంగా ణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీ ఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గత మార్చి, ఏప్రి ల్, మే నెలలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులను 40 శాతం మంది గృహ వినియోగదారులు చెల్లించలేదని, దీంతో జూన్‌లో బకాయిలతో కలిపి ఒకేసారి 4 నెలల బిల్లులు రావడంతో ఎక్కువ మొత్తంగా కని పించడం మరో కారణమన్నారు. విద్యుత్‌ బిల్లులను అడ్డుగోలుగా పెంచారని విమర్శలు రావడంతో శని వారం ఆయన సంస్థ కార్యాలయంలో విలేకరుల స మావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చారు.

మూడేళ్లు గా రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, బిల్లులు పెంచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో మీ టర్‌ రీడింగ్‌ తీయకుండా తాత్కాలిక విధానంలో బిల్లులు జారీ చేశామన్నారు. ప్రస్తుత జూన్‌ నుంచి మీటర్‌ రీడింగ్‌ తీస్తున్నామని, జూన్‌లో 3నెలల విని యోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీసి గత రెండు నెలల్లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తున్నామన్నారు. వాస్తవ వినియోగం కంటే ఎవరై నా అధికంగా బిల్లులు చెల్లించి ఉంటే వారికి జూన్‌ బిల్లులను ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ వల్ల అనివార్య పరిస్థితిలో తాత్కాలిక బిల్లులు వసూలు చేయాల్సి వచ్చిందని, దీంతో 3 నెలల వినియోగానికి సంబంధించిన మీటర్‌ రీ డింగ్‌ను ఒకేసారి తీసి సగటున ఒక్కో నెలకు ఎంత వినియోగం ఉంటుందో అంచనా వేసి ప్రస్తుత నెల లో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో కొందరి స్లాబులు ఎగబాకి కొంత వరకు బిల్లులు పెరిగిన మాట వాస్తవమేనన్నారు. తాత్కాలిక బిల్లులతో స్థూలంగా విద్యుత్‌ సంస్థలే నష్టపోయాయని, వినియోగదారులకు ప్రయోజనం కలిగిందన్నారు.

వారంలో చార్జీల పెంపు ప్రతిపాదనలు
రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు 2019–20, 2020–21 ఆర్థిక సం వత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను వారంలో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పిస్తామని రఘుమారెడ్డి తెలి పారు. టారిఫ్‌ ప్రతిపాదనల తో పాటు ఏఆర్‌ఆర్‌ సమర్పించేందుకు గడు వు పొడిగించడానికి ఈఆర్సీ అంగీకరించలేదని, తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.

మరిన్ని వార్తలు