హోంగార్డు ఆత్మహత్య

19 Sep, 2017 02:53 IST|Sakshi
హోంగార్డు ఆత్మహత్య
తెలంగాణ వచ్చినా బతుకులు మారలేదన్న ఆవేదన
 
ఎల్లారెడ్డి: తెలంగాణ ఏర్పాటైనా తమ బతుకులు మారలేదని ఆవేదన చెందిన ఓ హోం గార్డు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది. ఎల్లారెడ్డికి చెందిన జంగం శివకుమార్‌ (32) భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో హోంగా ర్డుగా పనిచేస్తున్నాడు. చాలీచాలని వేతనం వల్ల కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సత మతమవుతున్నాడు. హోంగార్డుల జీతాలు పెంచి, ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా.. ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. దీంతో మన స్తాపం చెందిన శివకుమార్‌ సోమవారం స్వగ్రా మంలోని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సంఘ టన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది చాలీ చాలని వేతనాలతో రాష్ట్రంలోని ఏ హోంగార్డూ ఆనందంగా లేడని నోట్‌లో ఉంది. సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో తమ బతు కులు బాగుపడవని మనస్తాపంతో ఉరి వేసు కుని చనిపోతున్నానని, ఆర్థిక ఇబ్బందులతో బతుకులీడుస్తున్న హోంగార్డులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
 
హోంగార్డుల ఆందోళన..
శివకుమార్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులు ఎల్లారెడ్డికి తరలి వచ్చారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవా లని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. శివకుమార్‌ మృతితోనైనా మేల్కొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. హోంగార్డులకు కాంగ్రెస్‌ నాయకులు నల్లమడుగు సురేందర్, చెన్న లక్ష్మణ్, కుడుముల సత్యం, మనోహర్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. శివకుమార్‌ కుటుంబానికి సరైన న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ హోంగార్డులతో కలిసి ఆందోళన చేశారు.

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన భార్యకు ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ శ్వేతారెడ్డి, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ప్రకటించినా.. స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు హోంగార్డు మృత దేహాన్ని పోస్ట్‌మార్టంనకు తరలించారు.

 

మరిన్ని వార్తలు