మానవత్వాన్ని చాటుకున్న హోంగార్డు

19 Feb, 2018 16:28 IST|Sakshi
పోగొట్టుకున్న సొమ్మును తిరిగి అందజేస్తున్న హోంగార్డు లహాను 

ఆసిఫాబాద్‌అర్బన్‌ : ఆసిఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జాడి లహాను(నెం.206) మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసిఫాబాద్‌ ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం జాడి లహాను ఈ నెల 17న రాత్రి స్థానిక అంబేద్కర్‌చౌక్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా 7.30 నిమిషాలకు ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి రూ 2,520 నగదు, ఆధార్‌ కార్డు పడిపోయాయి. డ్యూటీలో ఉన్న హోంగార్డు లహాను వాటిని తీసుకుని ఆధార్‌ కార్డు ఆధారంగా డబ్బులు పోగొట్టుకొన్న వ్యక్తికి సమాచారం అందించాడు. అతని దగ్గరనుంచి వివరాలు సేకరించగా వాంకిడి మండలం బోర్‌డా గ్రామానికి చెందిన నికోరె మొండిగా గుర్తించి స్థానిక పోలీసు స్టేషన్‌లో పోగొట్టుకొన్న డబ్బులను పోలీసు సిబ్బంది సమక్షంలో ఆదివారం తిరిగి ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో బాలాజి వరప్రసాద్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది తదితరులు హోంగార్డు జాడి లహానును అభినందించారు. 
 

మరిన్ని వార్తలు