ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

16 Sep, 2017 02:50 IST|Sakshi
ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

► ఈ దసరాకైనా జీతాలు పెంచాలని హోంగార్డుల విజ్ఞప్తి  

సాక్షి, హైదరాబాద్‌: పేరుకే గార్డు. కానీ, వారి జీవితానికి మాత్రం భద్రత లేదు. అరకొర జీతాలతో అస్తవ్యస్త జీవితాలు గడుపుతు న్నారు. ఇదీ హోంగార్డుల దుస్థితి. ఏడాదిన్నర కాలంగా జీతాల పెంపు, క్రమబద్ధీకరణపై వీరు ఆశలు పెంచుకున్నారు. కానీ, క్రమబద్ధీకరణ సాధ్యం కాదని న్యాయశాఖ స్పష్టం చేసింది. దీంతో జీతాల పెంపుపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చారు. దసరా పండుగ సమీపిస్తోందని, ఇప్పుడైనా తమ పరిస్థితిని అర్థం చేసుకొని జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు.

జీతాల పెంపు ప్రతిపాదన...
రాష్ట్రంలో 19 వేల మంది హోంగార్డులు పోలీస్‌ శాఖలోని 14 ప్రధాన విభాగాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండుసార్లు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జీతాలు పెంచి ప్రస్తుతం రూ.12 వేల చొప్పున అందిస్తోంది. పెరుగుతున్న ధరలు, నగర జీవనం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని హోంగార్డులకు జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ అనేక సార్లు ప్రకటించారు. డీజీపీ కార్యాలయం రెండుసార్లు ప్రతి పాదనలు పంపింది. కానిస్టేబుల్‌తో సమానంగా జీతభత్యాలు అందించడం తోపాటు ఆరోగ్య భద్రత, బస్‌పాస్, మెటర్నిటీ సెలవు వంటి సౌకర్యాలపై ప్రతిపాదనలు రూపొందించింది. ఇంకా వీటిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో హోంగార్డుల్లో ఆందోళన నెలకొంది.

ప్రతిపాదిత స్కేల్‌..
కానిస్టేబుల్‌ స్కేల్‌               హోంగార్డుల స్కేల్‌
బేసిక్‌ రూ.16,400           బేసిక్‌ రూ.13,000
డీఏ రూ.3,008              డీఏ రూ. 2,384
హెచ్‌ఆర్‌ఏ రూ.4,920      హెచ్‌ఆర్‌ఏ రూ.3,900
సీసీఏ రూ.700               సీసీఏ రూ.600
మొత్తం: రూ.25,028       రూ.19,884

మరిన్ని వార్తలు