‘ఏపీలో మంత్రి పదవులపై మాట్లాడాలి..’

6 Apr, 2017 19:23 IST|Sakshi
‘ఏపీలో మంత్రి పదవులపై మాట్లాడాలి..’

చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్నా బుడ్డర్‌ఖాన్‌ రేవంత్‌రెడ్డి ఏపీలో వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురి ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చింది ఈ విషయంపై సమాధానం చెప్పాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం గాంధీనగర్‌ వై జంక్షన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు బీఎన్‌ శ్రీనివాస్‌రావుయాదవ్‌, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నోరెత్తితే కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా నగంరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదని ఇక మీకు నోరు ఎక్కడిదని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అని చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌లో గెలిచామని చెప్పుకుంటున్నా బీజేపీ వారిపై ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగే ఆరోపణలు ఉన్నాయని ఆ విషయం ఎన్నికల కమిషన్‌ చూసుకుంటాదని చెప్పారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల  సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదు జరిగిన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. సభ్యత్వం  తీసుకున్న వారికి రూ. 2 లక్షల బీమా ఉంటుందని తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు